తెలుగు రాష్ట్రాలలో ధియేటర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. చాల ధియేటర్లకు కరెంటు బిల్లుకు సరిపోయే కలక్షన్స్ కూడ రాని పరిస్థితి వార్తలు వినిపిస్తున్నాయి. ‘టిల్లు స్క్వేర్’ ‘మంజుమల్ బాయ్స్’ లాంటి రెండు సినిమాలకు కొద్దిపాటి కలక్షన్స్ వస్తున్నప్పటికీ ఆ కలక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు అన్న సంకేతాలు వస్తున్నాయి.దీనికితోడు ఎన్నికల హడావిడి మండే ఎండలు ఐపిఎల్ టోర్నమెంట్ లు కూడ సినిమాల కలక్షన్స్ ను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం విడుదల అవుతున్న రెండు డిఫరెంట్ సినిమాలలో ఏసినిమా అయినా కనీసం హిట్ అవుతుందా అన్న ఆశ ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతోంది. చాల కాలం తరువాత నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ అంటూ వస్తున్నాడు. సమకాలిన రాజకీయాల మీద ఈ మూవీలో ఘాటైన సెటైర్లు ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.ఈసినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలక్షన్స్ బాగా వచ్చే ఆస్కారం ఉంది. ఈసినిమాతో పాటు తమిళ హీరో విశాల్ నటించిన ‘రత్నం’ మూవీకి మాస్ సినిమాల డైరెక్టర్ హరి దర్శకత్వం వహించడంతో ఈమూవీ మాస్ ప్రేక్షకులకు ఏమైనా నచ్చుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వరస ఫ్లాప్ లతో వీరిద్దరూ సతమతమైపోతున్నారు.ఈ రెండు సినిమాలలో ఏఒక్క సినిమాలలో ఏఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ధియేటర్లు కొంతవరకు కనీసం రాబోతున్న వీకెండ్ లో అయినా కళకళలాడే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఈ రెండు సినిమాల పై సగటు ప్రేక్షకులలో ఏమాత్రం క్రేజ్ లేదు. దీనితో ఈ ఇద్దరి ఫెయిల్యూర్ హీరోల మధ్య జరగబోతున్న ఈవారం వార్ లో కనీసం ఏఒక్క హీరో అయినా విజయం సాధిస్తాడేమో చూడాలి. ఈ రెండు సినిమాలు కూడ ఫెయిల్ అయితే ఇక ధియేటర్ల పరిస్థితి వర్ణించడానికి మాటలు కూడ ఉండవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: