నితిన్, సదా కాంబినేషన్ లో వచ్చిన జయం సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా అప్పట్లో విడుదల ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపుగా 22 ఏళ్ల క్రితం 2002వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. లవ్ ఎమోషన్స్ కామెడీ యాక్షన్ అన్ని కలగలసి ఉన్న ఈ సినిమా తేజ దర్శకత్వంలో వచ్చింది. ఇక ఈ సినిమాతో నితిన్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సదా కి కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.

 అంతేకాదు ఇందులో ఆమె చెప్పిన వెల్లవయ్య వెళ్ళు అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నితిన్ సదా తో పాటు ఇతర పాత్రలో నటించిన వాళ్లందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. విలన్ గా గోపీచంద్ నటించిన కమెడియన్ గా సుమన్ శెట్టి నటించారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తమ కెరియర్లో బిజీగా ఉన్నాడు. ఇక గోపీచంద్ విషయానికి వస్తే ఆ సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ ఇప్పుడు హీరోగా  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.


 అలాగే ఇందులో సదా చెల్లెలి పాత్రలో నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాలో ఎప్పుడూ అక్క అక్క అంటూ సదా వెనకే తిరిగి ఈ చిన్నారి నీ అందరూ అంత తేలికగా మర్చిపోలేరు. అయితే ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఈమెకు ఇప్పుడు పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు సదా చెల్లెలి పాత్రలో నటించిన ఆమె పేరు యామినీ శ్వేత. జయం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆ చిన్నారి ఆ సినిమా తర్వాత చదువులపై కాన్సన్ట్రేషన్ చేసింది. చదువులు ఆయన వెంటనే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది. అయితే సినిమాలకి దూరమైనప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఆక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: