బాలీవుడ్ బ‌డా హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ అండ్ బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఎనలేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరమయింది. ప్రెసెంట్ హెడ్ ఆఫ్ స్టేట్ చిత్రంతో రి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హాలీవుడ్ సింగర్ విగ్ జోనస్ ను పెల్లాడింది. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే నిత్యం ఈ బ్యూటీ ఫ్యామిలీతో ఏదో ఒక‌ వెకేషన్ కి వెళ్తూనే ఉంటుంది.

అందుకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక ఓ ఈవెంట్లో ధరించిన నక్లిస్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోమ్ లో బుల్గారి 140 వార్షికోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచింది. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన నక్లిస్ ని అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రియాంక చోప్రా 140 క్యారెట్ల డైమండ్ తో తయారు చేసిన నక్లీస్ ధరించింది. అయితే దాని ధర అక్షరాల రూ. 359 కోట్లు ఉండనున్నట్లు సమాచారం. ఇక దీనిని 2,800 గంటల సమయం పాటు కొంతమంది తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రజెంట్ ప్రియాంక చోప్రా నక్లీస్ ధర చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా ఇంత ఖర్చు పెట్టి ఒక్క నక్లిస్ కొన్నావా ప్రియాంక..ఆ డబ్బు ఏదో అనాధ ఆశ్రమాలకి ఇచ్చి ఉంటే బాగుండు. ఈ నక్లీస్ ని మహా అయితే మరో రెండు, మూడు సార్లు వేస్తారు అంతే. అదే ఆ డబ్బును అనాధ ఆశ్రమాలకి దానం చేసి ఉంటే వారి జీవితాలు బాగుపడేవి..  అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: