తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి సుకుమార్ శిష్యుడు అయినా అర్జున్ వై కే దర్శకత్వం వహించగా ... రాశి సింగ్ , పాయల్ రాధాకృష్ణమూవీ లో ఫీమేల్ లీడ్ లో నటించారు. అలాగే విజయ్ బుల్గానిన్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... లిటిల్ థాట్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మించారు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ఓ టి టి హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను ఈ సంస్థ వారు ఇప్పుడు గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కి అందుబాటులోకి వచ్చేసింది. మిగిలిన వారందరికీ రేపటి నుండి ఆహా సంస్థ ఈ సినిమాను అందుబాటు లోకి తీసుకు రానుంది. మరి థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో సుహాస్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: