ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా దేవర. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీతో ఆమె తెలుగు సినిమాలలో కూడా హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టబోతోంది. గత కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ స్టార్టింగ్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకోగా ప్రస్తుతం వ్యూస్ బాగా రాబడుతూ స్లో పాయిజన్లా ఎక్కేస్తుంది.అయితే ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే..అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా కూడా త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట ప్రోమో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.


అయితే తాజాగా ఇప్పుడు జాన్వి కపూర్ కి తాను హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమా కంటే.. తనకి ఏమాత్రం సంబంధంలేని పుష్ప 2 సినిమా మీదే… ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెని ఘోరంగా తిడుతూ మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫియర్ సాంగ్ గురించి చేసిన పోస్ట్ కి జాన్వీ కపూర్ లైక్ చేయలేదు ఇంకా ఆ సాంగ్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 పాట గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని మాత్రం జాన్వి కపూర్  లైక్ చేసింది. తన సొంత సినిమా దేవరను పెద్దగా పట్టించుకోని జాన్వి పుష్ప 2 సినిమా పై మాత్రం ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతూ ప్రశ్నిస్తున్నారు. అసలు యాక్టింగ్ రాని కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేని జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ తో మూవీ ఛాన్స్ రావడమే ఎక్కువ అలాంటిది ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి జాన్వీ కపూర్ తన పద్ధతి మార్చుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: