కథ చెబుతా ఉ కొడతావా.. ఈ మాట ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ఈ తరం వారికి ఈ మాట కొత్తగా ఉండొచ్చు కానీ పాత తరం వారికి తాతల అమ్మమ్మ, నానమ్మల ఇంటికి వెళ్తే ఇలానే ఆరు బయట అరుగు మీద కథ చెబుతూ మనవళ్లను మనవరాళ్లను ఆడిస్తుంటారు. ఐతే అలాంటి కథలు చెప్పే వెసులుబాటు ఇప్పుడు లేదు. అసలు పెద్దవారితో కలిసి ఉండే వీలే లేదు. అలా కథ చెప్పే పెద్ద వారు.. చెబితే వినాలని ఉన్న చిన్న పిల్లలు లేరు.

అలాంటి వారి కోసమే కథ చెబుతా ఉ కొడతారా అంటూ ఆసక్తికరమైన కథలతో వస్తున్నారు మోడర్న్ స్టోరీస్ తెలుగు (MODERN Stories Telugu) యూట్యూబ్ క్రియేటర్స్.  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం కేవలం సినిమా వాళ్లే కాదు యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఎంతో శ్రమ పడుతుంటారు. సోషల్ మీడియా లేదా యూట్యూబ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా యానిమేటెడ్ స్టోరీస్ తో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ల వరకు మనసుని మెప్పించే కథలు చెబుతూ సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు కొందరు యూట్యూబ్ క్రియేటర్స్.

తెర మీద కనిపించే స్టార్స్ కి మాత్రమేనా యానిమేటెడ్ హీరోలకు కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. చోటా భీం, మోతు పట్లు, డోరేమాన్ ఇలా అన్ని యానిమేటెడ్ కార్టూన్ సీరీస్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చాయి. అలాంటి యానిమేటె సీరీస్ లతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో భాగంగా తెలుగు యూట్యూబ్ ఛానెల్ మోడెర్న్ స్టోరీస్ తెలుగు వచ్చింది. ఆసక్తికరమైన కథలతో.. చిన్నపిల్లలను అలరించే కథనంతో ఔరా అనిపించేస్తున్నారు.

మోడర్న్ స్టోరీస్ తెలుగు (MODERN Stories Telugu) నుంచి వచ్చే ప్రతి కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దురాశతో ఏ పనిచేసినా సరే అది మన అంతం చూస్తుందని చెప్పే రాసి పెట్టివుంటే స్టోరీ ఆసక్తికరంగా ఉంది. జరాబందు, సరాబందు ఇద్దరు స్నేహితులు చాలా బిజినెస్ లు చేసి నష్టపోతారు అలాంటి వారు దురాశకి పోయి ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్న కథే రాసిపెట్టివుంటే.. ఈ స్టోరీ చూసిన ఆడియన్స్ అంతా కూడా ఇలాంటి మంచి కథలు మరిన్ని తీసుకు రావాలని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఆ కథ ఏంటో కింద వీడియోలో చూసేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: