బాహుబలి సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో భారతదేశానికి ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించిపెట్టాడు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తన తర్వాత సినిమా ఉంటుందని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు #SSMB29పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మహేశ్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే ఈ మూవీ కలెక్షన్స్‌ సంచలనంగా మారాయి.ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఏకంగా రూ. 1000 కోట్లు దాటుతుందని.. బిజినెస్ ఏకంగా రూ.2000 కోట్ల పైమాటేనని, రూ. 4000 కోట్లను క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే చరిత్ర సృష్టిస్తుందంటున్నారు.ఇదిలావుండగా సుకుమార్ అంటే కూల్ అనుకుంటివా.. కాదు ఫైర్ అని నిరూపించేసాడు.. గతంలో సుక్కు తీసిన సినిమాలు అన్ని కూడా చాలా కూల్ గా ఫ్యామిలి ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడి పోతామని చెప్పడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కో సినిమాకు వెరియేషన్స్ చూపించాడు. దాంతో తర్వాత సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ పుష్ప2 1000 కోట్ల గ్రాస్ సాధించడం చూశాక అప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవ్వాళ సుకుమార్ నిజం చేసి చూపించారు .ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప 2 అని వినిపిస్తుంది.. సంక్రాంతి వరకు చెప్పుకోతగ్గా సినిమాలు లేవు దాంతో పుష్ప 2 కలెక్షన్స్ రెండు వేల కోట్లు రావడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్..ఈ ఒక్క రికార్డుతో రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసిందనే చెప్పాలి.. ఇప్పుడు రాజమౌళి కన్నా గ్రేట్ అని సుకుమార్ ఒక్క సినిమాతో నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: