టైటిల్‌: రా రాజా
బ్యానర్ : పద్మిని సినిమాస్
నటీనటులు: సుగి విజయ్, మౌనిక తదితరులు
ఎడిటర్: ఉప్పు మారుతీ
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీ వాత్సవ్
మ్యూజిక్‌: శేఖర్ చంద్ర
రచన, నిర్మాత, దర్శకత్వం: బూర్లె శివప్రసాద్
రిలీజ్ డేట్‌: 7-3-2025


భారతీయ సినీ చరిత్రలో మొట్టమొదటి సారి ఫేస్ చూపించకుండా కేవలం నటీనటుల డైలాగులని, ఎక్స్ ప్రెషన్స్ ని మాత్రమే చూపిస్తు తెరకెక్కిన మూవీ రా రా. .ప్రచార చిత్రాలతోనే ఈ సినిమా ప‌ట్ల ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియెన్స్‌లో ఏదో ఉత్సుక‌త‌తో పాటు క్రేజ్ నెల‌కొంది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థ :
రాజా (సుజీ విజయ్),  రాణి (మౌనిక హెలెన్) తమ కుటుంబాలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. రాజా చాలా యేళ్ల త‌ర్వాత త‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకుంటాడు. ఆ త‌ర్వాత త‌న భార్య‌పై ఎటాక్ చేస్తాడు ?  దీంతో రాణి ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. అస‌లు రాజా త‌న భార్య‌పైనే ఎందుకు ఎటాక్ చేశాడు ?  రాజా ఫ్యామిలీ మెంబ‌ర్సే ఆమెపై దాడికి ఉసిగొలిపారా ?  లేక‌పోతే దీని వెన‌క ఏదైన క‌థ ఉందా ?  రాణి బ‌తికే ఉందా ?  రాజాని వేధిస్తోన్న దెయ్యం ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.


విశ్లేష‌ణ :
గత కొన్నేళ్లుగా తెలుగులో హార్రర్ క‌థాంశంతో కూడిన సినిమాలు ఎక్కువుగానే వ‌స్తున్నాయి. అందులో మంచి విష‌యం ఉండి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయితే ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌ను హిట్ చేస్తున్నారు. ఈ కోవ‌లోనే ద‌ర్శ‌కుడు బీఎస్ ప్ర‌సాద్ ఈ సినిమాలో పాత్ర ఫేస్‌ల‌ను చూపించ‌కుండా చేసిన ప్ర‌య‌త్నం మెచ్చుకోవాలి. భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప్ర‌య‌త్నం ఎవ్వ‌రూ చేయ‌లేదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని తెర‌మీద ఎలా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే విష‌యంలో డైరెక్ట‌ర్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట గాని.. పాత జంటలు అయినా అక్రమ సంబంధం మోజులో పడి,ఒకరికొకరు చంపుకుంటున్నారు.. ఈ త‌ర‌హా క‌థ‌నే ఈ సినిమాలో చూపించారు. సినిమాలో కొన్ని విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు మ‌రికాస్త క్లారిటీతో రాసుకుని తెర‌మీద ప్ర‌జెంట్ చేసి ఉంటే బాగుండేది. ప్రేక్ష‌కుల్లో మరింత క్యూరియాసిటీ కలిగించే విధంగా రాజా తన గర్ల్ ఫ్రెండ్ తో, రాణి  తన బాయ్ ఫ్రెండ్ తో వేరు వేరు గదుల్లో చాట్ చేస్తున్నట్టు చుపించాల్సింది. దీంతో ఎవరు ఎవర్ని చంపుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉండేది. ఇంటర్వెల్ టైంకి రాజా ఎప్పుడో రాణి ని చంపేశాడని చూపిస్తే ప్రేక్షకులు సరికొత్త థ్రిల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు... సెకండ్ ఆఫ్ లో రాజాని, రాణి దెయ్యంలా వేధించడం, రాజా చనిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవ్వడం... చివరకి దర్శకుడు తను అనుకున్న కథ లక్ష్యానికి వస్తే సినిమా అదిరిపోయేది.


ఇక ఈ త‌ర‌హా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర.. ఎక్కడ భయపెట్టాలో అక్కడ తన సౌండింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల బీజీఎంకు ప్రేక్షకులకు భయప‌డ్డారు. కొత్త ద‌ర్శ‌కుడు అయినా ఇలాంటి సినిమాతో ఎంతో అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమాను బాగానే డీల్ చేశాడు. కొన్ని సినిమాల్లో గ‌తంలో హిట్ అయిన హ‌ర్ర‌ర్ సినిమాల సీన్లు గుర్తుకు వ‌చ్చాయి. ఇక ద‌ర్శ‌కుడిగానే కాకుంగా నిర్మాత‌గాను సినిమా క‌థ‌కు తగిన‌ట్టుగా ఖ‌ర్చు పెట్టి మంచి ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తో క్వాలిటీగా సినిమాను తెర‌కెక్కించాడు. ఇలాంటి కాన్సెఫ్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో ఏ భాష‌లోనూ సినిమా రాక‌పోవ‌డం విశేషం. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరా వర్క్ బాగుంది. మారుతి ఎడిటింగ్ ఎక్కడా ఎంత సీన్ ఉంచాలో మంచిగా తెలిసినట్టు ఉంది.


ఫైన‌ల్‌గా..
ఓ డిఫ‌రెంట్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ను ఎంజాయ్ చేయాల‌నుకుంటే రా రాజా సినిమా మంచి చాయిస్‌


రా రాజా మూవీ రేటింగ్ : 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: