బంగారం అక్రమ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యా రావు కేసును సిపిఐ సుమోటోగా తీసుకుంది ..  డిఆర్ఐ అధికారులు అందించిన సమాచారం ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేసింది ..  ఈ కేసుకు సంబంధించి ముంబై బెంగళూరులో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది .. అలాగే ఈ హీరోయిన్ పై 14.20 కిలోల బంగారాన్ని ఆక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి .. అలాగే ఈ హీరోయిన్ నుంచి బంగారం నగదు సహా 17.29 కోట్ల విలువైన వస్తువులు డిఆర్ఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు .. అలాగే హీరోయిన్ రన్యా రావు నిరంతరం విదేశాలకు వెళ్లి వస్తూ ఉండేది .. ఇలా రన్యారావు కూడా ఇది  త‌న‌ గోల్డ్ స్మగ్లింగ్ గా  రాజధానిగా చేసుకున్నారు ..


 ఆమె యూరప్ , అమెరికా , దుబాయిలో ఎప్పుడు వెళ్తూ ఉండేది ఈ ఏడాది డిసెంబర్ 24 వెళ్లి డిసెంబర్ 27 ఇండియాకి తిరిగి వచ్చారు .. తర్వాత జనవరి 18న ఆమె మళ్ళీ అమెరికాకు వెళ్లి ఏడు రోజులు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే జనవరి 25న అమెరికా నుంచి బెంగళూరు తిరిగి వచ్చిన రన్యారావు ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి వరుసగా దుబాయ్ వెళ్తున్నట్లు ఆమె దర్యాప్తులో తేలింది .. అలాగే రన్యారావు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 3 వరకు 5 సార్లు దుబాయ్ ట్రావెల్ చేసి వచ్చింది . ఇక ఇప్పుడు మార్చి మూడవ తేదీ రాత్రి ఓ కీలక సమాచారం మేరకు వ్యవహరించిన డిఆర్ఐ అధికారులు .. ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్ రమ్యరావును దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయంలో తనిఖీ చేశారు ..

 

ఇక ఆ సమయంలో రన్యారా వద్ద దాదాపు 13 కి కోట్లు విలువైన 15 కిలోల బంగారం దొరికింది .. అధికారులు వెంటనే ఈమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు .. తర్వాత ఈమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ కు అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నప్పుడు .. 20 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు క్యాష్ దొరికాయి .. ఈమె సుదీర్ఘ విచారణ తర్వాత మార్చి ఐదు సాయంత్రం రన్యారావును న్యాయమూర్తి ముందు హాజరుపరిచి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు .. అలాగే మార్చి 7 మధ్యాహ్నం ప్రత్యేక ఆర్థిక నేరాలు విభాగానికి చెందిన న్యాయమూర్తి రన్యారావుని మూడు రోజులు పాటు DRI కస్టడీకి పంపాలని ఆదేశించారు .. సాయంత్రం ఓపెన్ కోర్టు ముందు హాజరు పరిచారు .. రన్యా రావు దర్యాప్తుకు సహకరించాలి, లేకుంటే ఆర్డర్ రాసేటప్పుడు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. రన్యా రావును ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: