
నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం రగడ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో మొదట ప్రియమణి స్థానంలో కాజల్ ను తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో కాజల్ ను కాకుండా ఆ మూవీ లో ప్రియమణి ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారట. ఇక నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ స్థానంలో మొదట కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలి అని ఈ మూవీ బృందం అనుకుందట. అందులో భాగంగా ఆమెను మేకర్స్ సంప్రదించారట. ఆమె కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈమె చివరి నిమిషంలో ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలా నాగార్జున , కాజల్ కాంబోలో రెండు మూవీలు మిస్ అయినట్లు తెలుస్తోంది.