టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన అనేక సినిమాలు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే మహేష్ హీరోగా రూపొందిన సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక మహేష్ హీరోగా రూపొందిన సినిమాల్లో రీ రిలీజ్ లో భాగంగా మురారి , ఒక్కడు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపించాయి.

ఇక మరికొన్ని రోజుల్లోనే మహేష్ హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమాను కూడా రీ రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే మహేష్ హీరో గా రూపొందిన మరికొన్ని సినిమాలు కూడా మరి కొంత కాలంలోనే రీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మహేష్ బాబు హీరోగా రూపొందిన అతిథి , ఖలేజా , అతడు , టక్కరి దొంగ సినిమాలను రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందాల వారు ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీల రీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అతిధి సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఖలేజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా బుల్లి తెరపై ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. అతడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. టక్కరి దొంగ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలా మహేష్ నటించిన అనేక సినిమాలను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: