సినిమా ఇండస్ట్రీలో కొన్ని జోనర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటూ ఉంటారు. ఇక దొంగతనాలపై ఏదైనా సినిమా వచ్చింది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఆ మూవీలను అత్యంత ఇష్టపడుతూ ఉంటారు. గతంలో దొంగతనాల కాన్సెప్ట్ తో వచ్చిన అనేక తెలుగు సినిమాలో మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఇతర భాష సినిమాలు కూడా ఈ జోనర్ కి సంబంధించినవి తెలుగులో మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దొంగతనాల కాన్సెప్ట్ మీద తాజాగా చౌర్య పాఠం అనే మూవీ ని రూపొందించారు.

ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న త్రినాధ్ రావు నక్కిన మొదటి సారి నిర్మాతగా ఈ మూవీని నిర్మించాడు. క్రైమ్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో ఇంద్రా రామ్ హీరోగా నటించాడు. ఈ మూవీతోనే ఈయన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. పాయల్ రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు నిఖిల్ గొల్లమారి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రాజీవ్ కనకాల , మస్త్ అలీ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ప్రకారం ... ధనపల్లి అనే ఊరిలో ఓ బ్యాంక్ దోచేందుకు ఓ ముఠా వేస్తుంది. కానీ ఆ తర్వాత వారికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఇదే విషయాన్ని ఈ మూవీ బృందం వారు ట్రైలర్ తో కామెడీగా చూపించారు. చౌర్య పాఠం అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఈ సినిమా మొత్తం ఒక బ్యాంకు దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్‌లో వినోదం , థ్రిల్ రెండూ కూడా సమపాళ్లలో కనిపిస్తున్నాయి. హీరో ఇంద్రా రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ , ఎక్స్‌ప్రెషన్స్ , డైలాగ్ డెలివరీతో చాలా బాగా ఆకట్టుకున్నారు. పేరుకు తొలి సినిమానే అయినా ఈ నటుడు అనుభవం ఉన్న నటుడిలా కనిపించారు. ఇలా ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు మరో విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: