ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటు అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ హీరోలలో నాని మంచి స్థాయిలో ఉన్నాడు. ఈయన వరుసగా దసరా , హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి . ఇకపోతే ఇప్పటికే నాని తనకు దసరా మూవీ తో మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ది ప్యారడైజ్ అనే మూవీ లో హీరో గా నటించడానికి కమిట్ అయ్యాడు . ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియోను కూడా ఇప్పటికే ఈ మూవీ బృందం విడుదల చేసింది . ఈ మూవీ గ్లీమ్స్ వీడియో అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను మే 2 వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్లో నాని మే 15 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: