కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రజినీ కాంత్ తన కెరియర్లో ఇ ప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల లో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు . ఇకపోతే రజనీ కాంత్ కెరియర్లో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న సినిమాలలో భాషా మూవీ ఒకటి. ఈ మూవీ లో రజనీ కాంత్ కి జోడిగా నగ్మా నటించగా ... సురేష్ కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ 1995 వ సంవత్సరం విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో రజనీ కాంత్ క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్గా నటించిన నగ్మా కి కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇలా 1995 వ సంవత్సరం విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీ రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి భాషా మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: