- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు .. ఇక ఈ సినిమా ను వచ్చే మే 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారే అవకాశం ఉంద ని టాక్ కూడా వినిపిస్తుంది .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది .. ఈ షూటింగ్లో పార్ట్ 2 కి సంబంధించిన సన్నివేశాల ను తెరకెక్కిస్తున్నారు .. అలాగే మొదటి భాగాని కి సంబంధించిన చాలా సన్నివేశాలు ఇప్పటికే పూర్తయినప్పటి కీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ కీలకమైన సీన్స్ ను ఇంకా షూట్ చేయాల్సి ఉంది ..


కాగా పవన్ త్వరలో నే షూటింగ్ లో అడుగు పెడతారని ఏప్రిల్ చివరి లోపు డబ్బింగ్ తో  పాటు ఆ సన్నివేశాల ను కూడా పూర్తి చేస్తార ని తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ లోపు పార్ట్ 2 కు సంబంధించిన సన్నివేశాలను మేకర్స్‌ తెరకెక్కిస్తున్నారు .. అదే విధంగా నిర్మాత ఏఎం రత్నం కొడుకు .. జ్యోతి కృష్ణ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు .. సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు .. బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి వంటి వారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు .. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై .. ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ వెన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .. అదే విధంగా  దర్శకుడు క్రిష్ కూడా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించిన విషయం తెలిసింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: