శ్రీ లీల ఇండస్ట్రీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది . శ్రీ లీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడమే గొప్ప విషయం అనుకుంటున్న మూమెంట్లో శ్రీ లీల ఎంట్రీ ఇచ్చి వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది . అంతేనా శ్రీ లీల డాన్సింగ్ స్టైల్ కూడా కోట్లాదిమంది జనాలు ఇష్టపడే విధంగా చేసుకుంది.  ఇప్పుడు కోలీవుడ్ - టాలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలలో శ్రీ లీల పేరు ఎలా మారుమ్రోగిపోతుందో అన్న విషయం అందరికీ బాగా తెలిసినదే.


అయితే బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇప్పుడు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది శ్రీ లీల . అందుకే మూడు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తుంది. కాగా శ్రీ లీల నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే శ్రీ లీల ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . ఇలాంటి మూమెంట్లోనే శ్రీలీల డెబ్యూ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నిజానికి శ్రీలీల ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ ఇవ్వాల్సింది. అయితే కొన్ని కారణాల చేత ఆ మంచి ప్రాజెక్టు మిస్ అయింది .



అది వేరే హీరోయిన్ ఖాతాలో పడి .. ఇప్పుడు ఆమె స్టార్ బ్యూటీగా మారిపోయింది . ఆ బ్యూటీ ఎవరో తెలిసితే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఆమె మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఆ మూవీ మరేంటో కాదు "చలో". నాగశౌర్య హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.  నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారట మేకర్స్ . కానీ కొన్ని కారణాల చేత శ్రీ లీల ఈ ప్రాజెక్టును ఓకే చేయలేదట.  ఆ తర్వాత రష్మిక చేతిలోకి ఈ ప్రాజెక్టు వెళ్ళింది . రష్మిక కెరియర్ ని ఏ రేంజ్ లో టర్న్ చేసిందో ఈ మూవీ అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: