ఇది నిజంగా అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.  ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు.. స్టార్ సెలబ్రిటీసే ఈ విధంగా బ్రేకప్ చెప్పేసుకుంటూ విడాకులు తీసుకుంటూ ఉండడం అభిమానులకి చాలా ఇబ్బందికరంగా హర్టింగ్ గా అనిపిస్తుంది. స్టార్ సెలబ్రెటీస్ ని రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్.  మరి అలాంటి ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డే  సిచువేషన్ లోకి నెట్టేస్తూ స్టార్స్ విడాకులు తీసుకుంటూ ఉండడం నిజంగా దారుణం అంటున్నారు జనాలు.


కాగా రీసెంట్ గానే హీరోయిన్ నజ్రియా నజీమ్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే . నజ్రీయా నజీమ్ పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ ఆమె విడాకుల విషయాన్ని బయట పెట్టేసినట్లయింది.  ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. ఆమె మరెవరో కాదు హన్సిక మోత్వాని . బన్నీతో దేశముదురు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.



ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్ళింది . అక్కడ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తన క్లోజ్ ఫ్రెండ్ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా దూరం దూరంగా ఉంటున్నారు అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . అంతేకాదు హన్సిక కూడా తన భర్తతో విడాకులు తీసుకునే ఆలోచనలోనే ఉంది అంటూ కోలీవుడ్ మీడియా చెప్తుంది . ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో హన్సిక మోత్వానీ  పేరు మారుమ్రోగిపోతుంది. ఏంటో ఇండస్ట్రీకి ఈ విడాకులు అనేది ఓ వైరస్ లా పట్టి పీడిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: