నితిన్ కెరియర్ ఇప్పుడు తిరోగమన దశలో ఉంది .. రీసెంట్ టైమ్స్ లో వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు .. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్‌ హుడ్ కూడా ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయింది .. ఇక ఇప్పుడూ తన కెరియర్ అంతా తమ్ముడు సినిమా పైనే ఆధారపడి ఉంది .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు .. కానీ ఇప్పుడు జులై 4కి షిఫ్ట్ అయిపోయింది .  జులై అంటే సమ్మర్ సీజన్ వదులుకున్నట్టే ..


నిజానికి తమ్ముడు సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది .. కానీ సమ్మర్ సీజన్ క్యాష్ చేసుకోవాలని కాస్త ఆగారు .. అయితే ఎప్పుడు సమ్మర్ ను కూడా మిస్ చేసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది .. మీడియం రేంజ్‌ సినిమాలకు విడుదల తేదీ అనేది ఎంతో ముఖ్యం .. పోటీ తక్కువ ఉన్నప్పుడు విడుదలకు రావాలి  వేస‌విలో కలెక్షన్లు క్యాష్ చేసుకోవాలనే చిన్న సౌలభ్యం ఉంటుంది .. యూత్ ని థియేటర్లకు రప్పించవచ్చు జూన్ లో కాలేజీలో మొదలవుతాయి .. ఇలాంటి సమయంలో మళ్ళీ వారిని థియేటర్ల వైపు తిప్పుటం అనేది ఎంతో కష్టం ..


అయితే మేకర్స్ ఐపీఎల్ కోసమే ఈ సినిమాను వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది .. మే 25 తో ఐపిఎల్ కంప్లీట్ అవుతుంది .. అది కంప్లీట్ అయ్యాకే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయి ఉంటారు .. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా అనిపిస్తుంది .. తెలుగు చిత్ర పరిశ్రమ పై ఐపిఎల్ ఎఫెక్ట్ ఎంతో గట్టిగా ఉంది .. యావరేజ్ సినిమాలను సైతం ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు గత వారం రెండు సినిమాలు వచ్చాయి. ఓదెల 2 , అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ .. ఈ సినిమాల కు టాక్ బాగున్న కూడా కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రం గానే ఉన్నాయి .. ఈ లెక్క కారణంగానే తమ్ముడు ఈ సీజన్ ను వదులుకుంది అని కూడా అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: