టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన అత్యంత స్లో గా సినిమాలను తెరకెత్తిస్తూ వస్తున్నాడు. దానితో ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలుపెట్టి చాలా సంవత్సరాలే అవుతున్న ఈయన ఇప్పటి వరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించాడు. కానీ ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వంశీ , ఆమీర్ కి కథను కూడా కొంత భాగం వివరించినట్లు , అది అమీర్ ఖాన్ కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత కాలంలోనే వంశీ పైడిపల్లి పూర్తి కథను అమీర్ ఖాన్ కి వినిపించనున్నట్లు , అది కనుక ఆమీర్ కి నచ్చినట్లయితే వీరి కాంబోలో సినిమా ఓకే అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే వంశీ పైడిపల్లి , ఆమీర్ ఖాన్ కాంబోలో రూపొందబోయే సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయి అని మొదట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమా నుండి దిల్ రాజు తప్పుకున్నట్లు , ఓ కొత్త బ్యానర్ వారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన బ్యానర్లలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు వంశీ పైడిపల్లి , అమీర్ ఖాన్ కాంబోలో సినిమా యొక్క నిర్మాణ బాధ్యతలను తీసుకున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓవర్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: