టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం జయం అనే మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టాడు. జయం మూవీ తో ఈయనకు మంచి విజయం దక్కింది. దానితో నటుడిగా ఈయనకు మంచి గుర్తింపు కూడా తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎన్నో విజయాలను అందుకున్న నితిన్ కి ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి భారీ అపజయాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితమే ఈయన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల కోసం ఓ తేదీని అనుకుంటున్నట్లు , దాదాపు దానినే కన్ఫామ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తమ్ముడు మూవీ ని ఈ సంవత్సరం జూలై 4 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఉన్నట్లు , ఒక వేళ ఈ సినిమాను ఆ తేదీనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లయితే మరి కొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి వరుస అపజాలతో డీలా పడిపోయిన నితిన్ "తమ్ముడు" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: