కొంత మంది ప్రేక్షకులు ప్రతి వారం థియేటర్లకి వెళ్లి సినిమాలను చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని కొన్ని వారాల్లో పెద్దగా థియేటర్లలో సినిమాలు విడుదల కానట్లయితే వారు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొన్ని సందర్భాలలో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో థియేటర్లలో సినిమాలని చూసి జనాలు అత్యంత ఆనంద పడుతుంటారు. ఇకపోతే ఈ రోజు అనగా ఏప్రిల్ 25 వ తేదీన ఏకంగా 12 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి ఆ 12 సినిమాలు ఏవి ..? అనేది తెలుసుకుందాం.

ప్రియదర్శి హీరో గా రూపొందిన సారంగపాణి జాతకం సినిమా ఈ రోజు పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. అలాగే సోదర అనే సినిమా కూడా ఈ రోజు విడుదల కానుంది. శివ శంభో , హలో బేబీ , శౌర్య పాఠం , ALCC , సర్వం సిద్ధం , సూర్యాపేట జంక్షన్ , మన ఇద్దరి ప్రేమ కథ , 6 జర్నీ , ఖింఖానా అనే డబ్బింగ్ సినిమా , తుడురమ్ అనే డబ్బింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా ఈ రోజు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర చాలా తెలుగు సినిమాలు , రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా ఒకే రోజు 12 సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఇది సినీ లవర్స్ కు ఫుల్ ఖుషి అయ్యే న్యూస్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ రోజు మొత్తంగా 12 సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్న అందులో కేవలం ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: