
అలాగే మురళీ శర్మ పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి ఆ తర్వాత సినిమాల్లో అడుగు పెట్టారు.. ఇక మురళీ శర్మ ముందుగా బాలీవుడ్ మూవీ రాజ్ లో నటించారు ఆ తర్వాత షారుక్ ఖాన్ మైహూనా లో కూడా నటించారు .. ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో విలన్ పాత్రలో నటించారు .. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మురళి శర్మ .. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ భారీ క్రేజ్ తెచ్చుకున్నారు .. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు మురళి శర్మ .. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే మురళి శర్మ మాత్రమే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు .. ఆమె కూడా పలు విలన్ పాత్రలో నటించి మెప్పించారు .. ఈ విషయం చాలామందికి తెలియదు ..
ఇక మురళి శర్మ భార్య పేరు .. అశ్వినీ కల్‌శేఖర్ .. ఇక అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించినది కూడా ఈమె .. ఈ సినిమాతో ఈమేకు భారీ క్రేజ్ కూడా వచ్చింది .. ఇక అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీ బుల్లితెరపై , హిందీ సినిమాలో , టీవీ సీరియల్స్ లో కూడా నటించి అదరగొట్టారు .. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ బద్రీనాథ్ తో పాటు రవితేజ హీరోగా వచ్చిన నిప్పు సినిమాలోని విలన్ భార్యగా నటించారు అశ్విని .. అలాగే ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమాలో కూడా విలన్ భార్యగా నటించారు అశ్వినీ కల్‌శేఖర్ .. ఇక ప్రస్తుతం అశ్వినీ హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక మురళి శర్మ టాలీవుడ్ లో దూసుకుపోతుంటే ఆయన భార్య హిందీలో అదరగొడుతుంది..
