నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వ‌రుస‌ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరికి వస్తున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న నాని .. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా అదరగొడుతున్నాడు .. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న నాని ఇవ్వలే కోర్ట్ సినిమాని నిర్మించి భారీ విజ‌యాన్నీ తన ఖాతలో వేసుకున్నాడు .. ఇక చిన్న సినిమాగా వచ్చి కోర్ట్ మూవీ భారీ విజయ అందుకుంది .. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది .. ఇక ఇప్పుడు నాని హీరోగా రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి . ప్రజెంట్ నాని హీరోగా నటించిన హిట్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది .. ఇక ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు ..
 

ఇక ఇప్పటికే హిట్ ప్రాంచేజ్ లో  వచ్చిన హిట్ , హిట్ 2  సినిమాలు మంచి విజ‌యం అందుకున్నాయి .. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో హిట్ 3 రానుంది . ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని .. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది .. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ప‌లు విషయాలు పంచుకున్నారు ..  ఇక ఇందులో భాగంగా తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి కూడా తన మనసులో మాటను చెప్పేసాడు నాని ..



ఇక ఆ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ నాకు శ్రీదేవి గారు,సౌందర్య అంటే ఎంతో ఇష్టమని నాని చెప్పకు వచ్చాడు .. శ్రీదేవిని తాను ఎంతగానో ఆరాధించాను .అలాగే   శ్రీదేవి , వెంకటేష్ నటించిన క్షణం క్షణం సినిమా ఎన్నోసార్లు చూశాను ఎన్నిసార్లు చూశానా లెక్కలేదని కూడా నాని చెప్పకు వచ్చారు .. కొన్ని లక్షల సార్లు చూసిన ఆ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ .. అలాగే అసలు శ్రీదేవి  అంత అందంగా ఉన్నారో ఇప్పటికే నాకు అర్థం కావటం లేదు .. ఆ సినిమాకే శ్రీదేవి అందం తీసుకొచ్చారని కూడా ఆయన చెప్పుకొచ్చారు .. ఇక నాని హిట్ త్రీ మే 1న గ్రాండ్గా ప్రేక్షకులు ముందుకు రానుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: