తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో తమన్నా ఒకరు. ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో విజయాలను అందుకొని ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఇప్పటికి కూడా అద్భుతమైన స్థాయిలో నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే తమన్నా కొంత కాలం క్రితం నేరుగా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన ఓదెల 2 అనే సినిమాలో ప్రధాన పాత్ర లో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. టోటల్ గా ఈ మూవీ కి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ ఇంక ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 40 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.30 కోట కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.76 కోట్ల షేర్ ... 5.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కలుపుకొని 40 లక్షల కలెక్షన్ దక్కాయి. 7 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.16 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 11 కోట్ల భారీ టార్గెట్తో బరిలోకి దిగగా ... ఈ మూవీ మరో 7.84 కోట్ల రేంజ్ లో ఈ సినిమా షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: