టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా శ్రీ విష్ణు , ఆసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ మూవీలోని శ్రీ విష్ణు నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం మే 9 వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే మే 9 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర సినిమాను విడుదల చేయనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ రాజా మూవీ ని ఈ తేదీన విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ మూవీ బృందం ఆ తేదీ నుండి ఈ సినిమాను తప్పించింది. అలాగే నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడు సినిమాను కూడా ఈ తేదీన విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా అనేక మూవీ బృందాలు ఈ తేదీ నుండి తప్పుకోవడంతో సింగిల్ మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: