పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి ప్రభాస్ రేంజ్ ని అవమానిస్తూ మంచు విష్ణు చేసిన కామెంట్లు తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.అంతేకాదు మంచు విష్ణు చేసిన ఈ కామెంట్లు ప్రభాస్ అభిమానులకు అస్సలు రుచించడం లేదు. మరి ఇంతకీ మంచు విష్ణు ప్రభాస్ ని ఎందుకు అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం. మంచు మోహన్ బాబు నిర్మాతగా చేస్తున్న మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప ఎన్నోసార్లు వాయిదా పడుతూ చివరికి జూన్ 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా లో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళం నుండి తమిళ్ నుండి తెలుగు నుండి బాలీవుడ్ నుండి ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి యాక్టర్ ని తీసుకొని మంచు విష్ణు తన సినిమాకి భారీ హైప్ తెచ్చుకుంటున్నారు.

 బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ మలయాళం నుండి మోహన్లాల్ ఇలా ఇద్దరు స్టార్లు ఈ సినిమాలో చేస్తున్నారు. అలాగే మోహన్ బాబు, ప్రభాస్,కాజల్ వంటి సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అయితే కన్నప్ప మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మంచు విష్ణు.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ప్రభాస్ గురించి సంచలన కామెంట్లు చేశారు. ఎవరు ఏమనుకున్నా కూడా నా దృష్టిలో ప్రభాస్ కేవలం ఓ నార్మల్ యాక్టర్ మాత్రమే ఆయన ఇంకా లెజెండ్ కాలేదు.. లెజెండ్ కావాలంటే ఇంకొంత సమయం పడుతుంది. నా దృష్టిలో మోహన్లాల్ లెజెండరీ నటుడు.. ఆయన తన సినిమాలతో లెజెండ్రీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు అంటూ ప్రభాస్ ని అవమానిస్తూ ఆయన లెజెండ్ కాదు అని మంచు విష్ణు మాట్లాడారు. అయితే మంచు విష్ణు చేసిన కామెంట్లు ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.

ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ కి పాన్ ఇండియా రుచి చూపించిన ప్రభాస్ ని అవమానిస్తావా.. ఆయన నార్మల్ యాక్టర్ అని అంటావా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు అంత పెద్ద హీరో కుటుంబం నుండి పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వచ్చిన నువ్వు ఎంతవరకు లెజెండ్ వి.. అసలు నీకు ఇంతవరకు సరైన హిట్టు ఒక్కటైన పడిందా.. ఎప్పుడూ తండ్రి, తమ్ముడి సపోర్ట్ తీసుకుంటే సినిమాలు చేస్తావ్..నీ సొంతంగా ఎప్పుడైనా సినిమా చేసి హిట్ కొట్టావా అంటూ మంచు విష్ణు పై ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: