
తెలుగు సినీ ఇండస్ట్రీని మరొక స్థాయికి తీసుకువెళ్లిన హీరోగా పేరుపొందిన చిరంజీవి ఎంతోమంది దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు.. చిరంజీవి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడమేగా ఈ సినిమాతో 150 కోట్ల క్లబ్లోకి చేరారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, వీర సింహారెడ్డి చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నారు. కానీ చిరంజీవి కెరీర్ లో కూడా రీ ఎంట్రీ తర్వాత కొన్ని ప్లాపులను ఎదుర్కోవడంతో చాలామంది ట్రోల్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా జరగనిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తూ ఉండగా త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పనులను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ కి చిరంజీవి ఒక కండిషన్ పెట్టినట్లుగా న్యూస్ వినిపిస్తున్నాయి. ఆ కండిషన్ ఏమిటంటే ఈ సినిమా కోసం చిరంజీవిని కలిసి కథ వినిపించారట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. కథ నచ్చిన తర్వాత.. ఈ చిత్రాన్ని హీరో నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలలో నటిస్తారని ఒక కండిషన్ ని చిరంజీవి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.