యంగ్ హీరో గా యాటిట్యూడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కి నేచురల్ స్టార్ నానికి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయా.. వీరిద్దరి మధ్య ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు చూద్దాం..నాని హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. అలా ఈయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అ!,హిట్, హిట్ -2, కోర్టు వంటి సినిమాలు తెరకెక్కాయి. అయితే ఈయన బ్యానర్ లో వచ్చిన హిట్ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు.ఆ తర్వాత హిట్-2 సినిమాలో హీరోగా అడివి శేష్ కనిపించారు.దాంతో నానికి విశ్వక్ సేన్ కి మధ్య గొడవలు జరిగాయని చాలా రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా హిట్ -3  ప్రమోషన్స్ లో భాగంగా నాని విశ్వక్ సేన్ తో జరిగిన గొడవల గురించి క్లారిటీ ఇచ్చారు.

 నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు విశ్వక్ సేన్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవు.అయితే హిట్ సినిమాలో ఆయన్ని తీసుకొని హిట్-2 సినిమాలో అడివి శేష్ ని తీసుకోవడంతో మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే రూమర్లు వినిపిస్తున్నాయి.కానీ హిట్ టు సినిమాకి కూడా మొదట విశ్వక్ సేన్ నే అడిగాము. కానీ ఆయన డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పడంతో చివరికి ఆ సినిమాలో అడివి శేష్ ని తీసుకున్నాము.

 అంతేకానీ విశ్వక్ సేన్ కి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ నాని విశ్వక్ సేన్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఇక నాని హిట్ 3 మూవీ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమా తర్వత నాని ప్యారడైజ్ మూవీలో చేస్తున్నారు.ప్యారడైజ్ మూవీ నుండి వచ్చిన అన్ని అప్డేట్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హోప్స్ పెంచేశాయి.అంతేకాదు నాని చాలా వైల్డ్ లుక్ లో కూడా ప్యారడైజ్ మూవీలో కనిపించబోతున్నారని అర్థం అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: