యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.ఈయన విదేశాలలో చక్కర్లు కొడుతూ తెలియని ఎన్నో ప్రదేశాలను అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ వాళ్ళు తినే ఫుడ్డు గురించి అన్ని కూడా ఒక వ్లాగ్ రూపంలో తీస్తూ యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి ఫేమస్ యూట్యూబర్ గా మారి కోట్లు సంపాదిస్తున్నారు. అయితే అలాంటి యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ తాజాగా తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లపై తెలుగు సెలబ్రిటీలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై మండిపడ్డారు.ఆయన ఇప్పటికే ఎంతోమంది తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్లపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాదు బిగ్బాస్ నుండి వచ్చాక ఈ కంటెస్టెంట్స్ అందరికీ కోట్లకు కోట్ల డబ్బులు వచ్చి కార్లు బంగాళాలు కొనుక్కోడానికి కారణం బెట్టింగ్  యాప్స్ ప్రమోట్ చేయడమేనని కుండబద్దలు కొట్టినట్టు వారి పేర్లతో సహా ఫోటోలతో సహా బయటపెట్టారు. అయితే తాజాగా దీనంతటికీ కారణం అక్కినేని నాగార్జుననే అంటూ మరో పెద్ద బాంబు పేల్చారు నా అన్వేషణ అన్వేష్.ఆయన మాట్లాడుతూ.. ఒక స్కూల్లో విద్యార్థి తప్పు చేస్తే అది టీచర్ బాధ్యత.

కానీ స్కూల్లో ఉన్న విద్యార్థులు మొత్తం తప్పు చేస్తే అది ప్రిన్సిపాల్ బాధ్యత. ప్రస్తుతం బిగ్బాస్ కంటెస్టెంట్ల అందరికీ ప్రిన్సిపాల్, టీచర్ నాగార్జుననే.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పెద్ద నేరం. అంతేకాదు అవి అన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్.దీనంతటికీ ప్రిన్సిపాల్ టీచర్ అయినటువంటి నాగార్జుననే కారణం తప్పంతా ఆయనదే.. ఈ సెలబ్రిటీలందరూ మన ఇండియాకి సంబంధించినవి కాకుండా ఉగ్రవాదులకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.ఎంతోమంది తిండికి తికానా లేకుండా ఉన్న వారికి ప్లాట్ఫారం ఇచ్చి బయటికి వచ్చాక వాళ్ళు అడ్డమైన పనులు చేయడానికి కారణం అవుతున్నారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎంతోమంది అడ్డమైన పనులు చేస్తున్నారు. బిగ్బాస్ లో వారిని చూసి అట్రాక్ట్ అయిపోయిన ప్రజలు వారు బయటికీ వచ్చాక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాటికి కూడా అట్రాక్ట్ అయ్యి మోసపోతున్నారు. నేను ఈ బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించినందుకు దాదాపు 45 లక్షల వరకు వచ్చాయి.

ఇవన్నీ మనిషికి రెండు లక్షలు పంచుతాను.మీరు అన్నపూర్ణ స్టూడియో మొత్తం అమ్మేసి బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయిన బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించగలరా.. చెల్లించలేరు ఎందుకంటే దీని గురించి అడిగితే దాంతో నాకేంటి సంబంధం అని తప్పకుంటారు.. చెత్త కంటెస్టెంట్ వరస్ట్ కంటెస్టెంట్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ విన్నర్ ను చేసి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. సమాజం గురించి తెలియని ఎదవని విన్నర్ ని చేశారు. ఒక టీవీ యాంకర్ గా పనిచేసే శివ జ్యోతికి కోట్లకు కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే.దీనంతటికి కారణం మీరే అంటూ అక్కినేని నాగార్జునపై సంచలన ఆరోపణలు చేశారు అన్వేష్.అంతేకాదు చిరంజీవికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చారు కాబట్టి ఆయనకు అన్ని విలువలు తెలుసు.కానీ మీరు పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు కదా..అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు ఎంతో గౌరవం.ఆయన మచ్చలేని చంద్రుడు అంటూ ఏఎన్ఆర్ ని పొగుడుతూ నాగార్జునను తిడుతూ సంచలన వీడియో చేశారు.అయితే ఈ వీడియో పై అక్కినేని ఫ్యాన్స్,నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: