టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ కిడ్ గా పేరుపొందింది హీరోయిన్ శృతిహాసన్.. శృతిహాసన్ తండ్రి కమలహాసన్ స్టార్ హీరోగా ఉన్నప్పటికీ కూడా తన తండ్రి ఇంప్లిమెంట్ ని ఎక్కడ ఉపయోగించుకోకుండా తన సొంతంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. శృతిహాసన్ ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎన్నో విషయాలను తెలుసుకొని వచ్చానని తెలియజేసింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతిహాసన్ చిన్ననాటి విషయాలను పంచుకోవడమే కాకుండా తన తల్లి తండ్రులు విడాకులు తీసుకోవడం పై మాట్లాడడం జరిగింది.


శృతిహాసన్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి రావడానికి ముందు తన జీవితంలో జరిగింది చెబుతున్నానని.. తన తల్లిదండ్రులు విడిపోవడం తనని చాలా బాధకు గురి చేసింది.. వారిద్దరు విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిందని తెలిపింది. అలా చెన్నైలో ఉండే వాళ్ళం ముంబైకి వచ్చేసామని.. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసాను అప్పటివరకు పెద్దపెద్ద కార్లలో తిరిగే తాను లోకల్ ట్రైన్లలో ప్రయాణించాను.. రెండు రకాల జీవితాలను తాను చూసానని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన తండ్రితోను ఎక్కువగా ఉంటున్నానని తెలిపింది. తాను విదేశాలలో సంగీతాన్ని నేర్చుకొని గుర్తింపు తెచ్చుకున్నారని ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా తనకు తాను జీవిస్తున్నానని తెలియజేసింది.


శృతిహాసన్ తల్లిదండ్రులు కమలహాసన్ ,సారిక 2004లో విడిపోవడం జరిగింది. శృతిహాసన్ ప్రస్తుత సినిమాలకు విషయానికి వస్తే కూలీ చిత్రంలో నటిస్తున్నది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఇందులో నాగార్జున, ఉపేంద్ర తదితర నటీనటులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొత్తం కూడా బంగారం స్మగ్లింగ్ అనే కథ అంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ తన తల్లిదండ్రుల పైన చేసిన ఈ వ్యాఖ్యలు  సోషల్ మాధ్యమికాలలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: