
ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందం కోసం ఎలాంటి డైట్లను ఫాలో అవుతూ ఉంటారు అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ కడుపు నిండా అన్నం తినాలి అనుకున్నా ఆలోచిస్తూ ఉంటారు . బరువు పెరిగిపోతారు అని.. ఫిజిక్ కంట్రోల్ తప్పుతుంది అని అవకాశాలు రావు ఏమో అని చాలా భయపడుతూ ఉంటారు . నిజం చెప్పాలి అంటే కడుపునిండా అన్నం తినడానికి కూడా రకరకాల కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు .
అయితే ఇప్పుడు హీరోల పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది . చాలామంది తెలుగు హీరోస్ ఫుల్ డైట్ కంట్రోల్ లోకి వచ్చేసారు . మరిముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాల్లో నటించే స్టార్స్ సినిమా కోసం రకరకాల డైట్లు చేస్తున్నారు . మొన్నటికి మొన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం మహేష్ బాబు 14 కేజీల బరువు తగ్గాడు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఏకంగా ఐదు నెలల్లో 18 కేజీల బరువు తగ్గాడు . ఇలా చాలామంది పాన్ ఇండియా స్టార్ హీరోస్ సినిమాల కోసం అన్నం తినకుండా కడుపులు మాడ్చేసుకుంటున్నారు. వేలకోట్ల ఆస్తి ఉన్న ఇష్టమైన ఫుడ్ తినే అదృష్టం లేకుండా పోయింది ఈ స్టార్స్ కి అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!