టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటుల లో శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. వరుసగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన , ఓం భీమ్ బుష్ మూవీ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా వరుస విజయాల తర్వాత ఈయన తనకు రాజ రాజ చోరా మూవీ తో మంచి విజయాన్ని అందించిన ఆసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన స్వాగ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ నటుడు సింగిల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు. దానితో ఈ మూవీ పై పెద్ద స్థాయి అంచనాలు లేవు. ఇక ఈ మూవీ ట్రైలర్ కనుక ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగి అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో శ్రీ విష్ణు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv