కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. అధిక్ రవిచంద్రన్ ఏ సినిమాకు దర్శకత్వం వహించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 16 రోజుల బాక్సా ఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. ఈ 16 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవేన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

16 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 144.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.30 కోట్లు , కర్ణాటక ఏరియాలో 14.15 కోట్లు , కేరళలో 3.50 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.35 కోట్లు , ఓవర్సీస్ లో 63.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 114.70 కోట్ల షేర్ ... 234.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 114 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 116 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 1.30 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak