గత కొద్ది నెలల నుండి లేడీ అఘోరి అనే పేరు చెప్పుకొని శ్రీనివాస్ అనే వ్యక్తి లేడీ అగోరాగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఎంత పెద్ద రచ్చ సృష్టిస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్గా మంగళగిరి కి చెందిన శ్రీ వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించాడు.మొదట శ్రీ వర్షినిని తీసుకువెళ్లాక ఆమె కుటుంబ సభ్యులు అగోరి నుండి ఆమెని తీసుకువచ్చారు.ఆ తర్వాత మళ్లీ వర్షిని అగోరి దగ్గరికి వెళ్లి ఆయన లేకుండా నేను ఉండలేను అంటూ చివరికి మెడలో తాళి కట్టించుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్లిపోయారు. అలాగే తమపై ట్రోలింగ్ చేస్తే కారుతో సహా పెట్రోల్ పోసుకొని చనిపోతామని అందర్నీ భయపెట్టించారు.ఇదంతా పక్కన పెడితే లేడీ అగోరి ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఆ రాజకీయ నాయకుడే అని, ఆ రాజకీయ నాయకుడి వల్లే లేడీ అగోరా ఇలా చేస్తుందని ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. 

అంతేకాదు అఘోరి వెనక ఆ రాజకీయ నాయకుడి హస్తము ఉందని, ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్లే అగోరి అంతలా రెచ్చిపోతుందని తెలుస్తోంది.అయితే అగోరి ఓ కార్లో తిరుగుతారు. కానీ ఆ కారుకి నెంబర్ ప్లేట్ కూడా ఉండదు.నెంబర్ ప్లేట్ లేదు కానీ ఆ కారు మాత్రం తమిళనాడులోని ఓ రాజకీయ నాయకుడు పేరు మీద రిజిస్టర్ అయి ఉందట. అయితే పోలీసులు ఆ రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి వివరాలు తీసే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న అగోరిని బయటకు తీసుకురావడానికి ఆ తమిళ రాజకీయ నాయకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

అలాగే లేడీ అగోరి తిరిగే కారు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే పేరు మీద రిజిస్టర్ అయిందట.అలాగే ఆ కారు నెంబర్ ని కూడా పోలీసులు బయటపెట్టారు. అది తమిళనాడుకు చెందిన నెంబర్ కావడంతో ఆ కారుని లేడీ అఘోరికి తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడే కొనిచ్చారని, అలాగే అగోరికి సంబంధించిన ఏ విషయాలైనా సరే ఆ రాజకీయ నాయకుడు దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తోంది. డబ్బు సహాయం కూడా చేస్తాడని సమాచారం. మరి లేడీ అగోరి కి సహాయం చేస్తున్న ఆ తమిళ రాజకీయ నాయకుడు ఎవరు? పోలీసులు పేరుతో సహా బయట పెడతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: