పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ దర్శకుడిగా మారారు.. అయితే ఒకప్పుడు ఈయన సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉండేది.అందుకే హీరోలను ఈయన స్టార్లుగా మార్చారు. అలా ఈయన దర్శకత్వంలో బద్రి, పోకిరి, బిజినెస్ మాన్, ఇడియట్, శివమణి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, దేశముదురు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో అంత బాగా సినిమాలు తీయడం లేదు.పూరి డైరెక్షన్ లో ఏదో మ్యాజిక్ మిస్ అయింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. అంతేకాదు పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాప్స్ అవ్వడంతో పూరి జగన్నాథ్ ని ఏ ఒక్క హీరో కూడా నమ్మడం లేదు అవకాశం ఇవ్వడం లేదు.అలా ఈ మధ్యనే తమిళ హీరో విజయ్ సేతుపతితో బెగ్గర్ అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే ఓ సీనియర్ నటికీ ప్రతినెల పూరి జగన్నాథ్ 15 వేల రూపాయలు ఆమె ఖాతాలో వేస్తారట. మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే రమాప్రభ. అయితే పూరి జగన్నాథ్ రమాప్రభ ఖాతాలో 15000 వేయడం ఏంటి.. అది కూడా ప్రతి నేలనా.. అసలు వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. అయితే వీరిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. కానీ పూరి జగన్నాథ్ మొదట కృష్ణ తో సినిమా ఓకే చేసుకొని ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సినిమా ఆగిపోవడంతో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. దాంతో పూరి జగన్నాధ్ దగ్గరికి వెళ్లిన రమాప్రభ ఏమి బాధపడకు.కృష్ణ సినిమా పోతేనేం..

ఆయన కొడుకుతో నువ్వు సినిమా తీసి ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్తావు అని చెప్పారట. ఇక రమాప్రభ మాటలు ఆయనలో ఒక స్ఫూర్తిని నింపాయట.ఆ తర్వాత పూరి జగన్నాథ్ రమాప్రభ చెప్పినట్లే మంచి స్థాయికి వెళ్లారట. దాంతో రమాప్రభని గుర్తుపెట్టుకుని మరీ పూరి తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారట. ఆ తర్వాత కొద్ది రోజులకు రమాప్రభ కష్టాల్లో ఉందనే విషయం తెలుసుకున్న పూరి జగన్నాథ్ ప్రతినెల ఆమె ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసి ఆమెకు సహాయం చేశాడట. అయితే ఈ విషయాన్ని రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: