ఆర్ఎక్స్ 100 హీరో అని చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నటుడు కార్తికేయ మాత్రమే. ఈయన ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా అటు డైరెక్టర్ తో పాటు హీరో హీరోయిన్లకి కూడా మంచి గుర్తింపు లభించింది.ముఖ్యంగా ఒక హీరో బాడీ ఫిజిక్ ని చూసి మైమరిచిపోయిన హీరోయిన్ కేవలం కోరిక తీర్చుకోవడం కోసమే హీరోని వాడుకొని ఆ తర్వాత డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటుంది. అలా ఒక రియల్ స్టోరీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్టు కొట్టారు.ఈ విషయం పక్కన పెడితే ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత కార్తికేయకి పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అజిత్ వలిమై, నాని'స్ గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు కార్తికేయ. అలా ఓవైపు హీరో గానే కాకుండా మరోవైపు తన విలనిజంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 

అయితే అలాంటి కార్తికేయ గత ఏడాది భజే వాయువేగం అనే సినిమాతో మన ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అంతగా హిట్ కొట్టలేదు. అయితే కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కార్తికేయకు పెళ్లి కలిసి రాలేదని, పెళ్లి తర్వాత ఆయనకు ఎలాంటి హిట్స్ కూడా పడడం లేదు అనే ఒక రూమర్ మీడియాలో వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నా కెరీర్ నాశనం అయ్యింది అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. అలాగే నేను పెళ్లి చేసుకున్న సమయంలో చాలామంది ఇప్పుడే వద్దు లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకోమని చెప్పారు. కానీ నేను ఈ యంగేజ్ లోనే అంటే 28 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లయ్యాక నా కెరీర్ నాశనమైంది అంటే నేను ఒప్పుకోను. కొంతమంది నన్ను పెళ్లి చేసుకోకని చెప్పారు. సినిమాలో సెట్ అయ్యాక పెళ్లి చేసుకోమన్నారు.

కానీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ పెళ్లయ్యాక కూడా రాణిస్తున్నారు కదా అని నాకు నేనే ప్రశ్నించుకొని పెళ్లి చేసుకున్నాను.అయితే పెళ్లి అయిందా కాలేదా అనేది మ్యాటర్ కాదు సినిమాలో కథ ఎంత బలంగా ఉందా లేదా అనేదే నేను చూస్తాను.. సినిమాలో కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అదొక్కటే నేను నమ్ముతాను అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. ఇక ఈయన మాటలతో పెళ్లి తర్వాత ఆయన కెరీర్ అంతా బాగాలేదు అనే మాటలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక కార్తికేయ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో విలన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మేకర్స్ ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా బయట పెట్టలేదు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తికేయ విలన్ గా ఫిక్స్ అయితే మాత్రం ఆయన దశ తిరిగిపోయినట్టే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: