తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగారు. చిరంజీవితో ఒక్కసారి సినిమాలో చేసిన చాలు అనుకునే హీరోయిన్స్ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు అప్పట్లో చిరంజీవితో ఆఫర్ అంటే హీరోయిన్ల లైఫ్ మారిపోతుందని భావించేవారు. అలా చిరంజీవితో సినిమా అని చెప్పి ఆ హీరోయిన్ మదిలో ఆశలు పుట్టించి చివరి సమయాన ఆ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకొని ఆమెకు షాకిచ్చారు. దీంతో ఆ హీరోయిన్ చాలా బాధపడింది. అంతేకాదు ఈ సినిమాలో ఆమెను తప్పించడం వల్ల చిరంజీవే ఈ పని చేశాడని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. అంతేకాకుండా చిరంజీవి కి ఆ హీరోయిన్ కి మధ్య గొడవలు కూడా జరిగినట్టు వార్తలు క్రియేట్ చేశారు. కానీ చిరంజీవి సినిమా ఎలా మిస్ అయిందో ఆ హీరోయిన్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. 

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అందాల భామ ఆమని.. ఒకప్పుడు ఈమె సినిమాల్లో నటిస్తుంది అంటే థియేటర్లన్నీ ఫుల్ అయిపోయాయి. అలా కొన్నాళ్లపాటు తన మానియా చూపించిన ఆమని ఆ తర్వాత ఫెడౌట్ అయింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సీరియల్స్, పలు రియాల్టీ  షోలు, సినిమాలు చేస్తోంది ఆమని. అలాంటి ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో ఉన్నటువంటి గొడవల గురించి బయట పెట్టింది. అప్పట్లో ఆమని మావిచిగురు సినిమాలో నటించడం చూసి ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయట. ఇదే క్రమంలో రిక్షావోడు చిత్రంలో కూడా ఆమెకు ఆఫర్ ఇచ్చారట. ఇందులో చిరంజీవి హీరో.

ఈ విషయం తెలుసుకున్న సౌందర్య కూడా ఆమని కి కంగ్రాట్స్ చెప్పిందట. ఇంతలో ఏమైందో ఏమో ఆమనిని అందులో నుంచి తీసేసి నగ్మాని హీరోయిన్ గా ఫైనల్ చేశారట.. దీంతో ఆమని నన్ను ఎందుకు సినిమా నుంచి తీసేసారని అడగడంతో  సినిమాకి డైరెక్టర్ మారారని,అందుకే మిమ్మల్ని తీసేసారని చెప్పడంతో ఆమె సైలెంట్ అయిపోయారట. అయితే ఈ విషయాన్ని ఆమని చెబుతూ.. నాకు చిరంజీవికి ఎలాంటి గొడవలు జరగలేదని, డైరెక్టర్ మారడం వల్లే నాకు ఆ సినిమాలో  ఛాన్స్ వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయిందని  తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: