టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నేచురల్ స్టార్ నానికి ఉన్న ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న నానిసినిమా అనంతరం వరుసగా సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇప్పటివరకు నాని తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో తాజాగా నటించిన చిత్రం హిట్-3. 

గతంలోనే రిలీజ్ అయిన హిట్, హిట్2 సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా హిట్-3 సినిమాను తీశారు. ఇందులో నాని హీరోగా నటించగా.... శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈవెంట్ లో భాగంగా నాని మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను హీరోగా నటించిన హిట్-3 సినిమాను రాజమౌళి గారు తప్పకుండా చూడాల్సిందేనని నాని అన్నారు. లేదంటే ఆయన పాస్ పోర్ట్ నేను లాగేసుకుంటానని నాని అన్నారు. గతంలో 'కోర్టు' సినిమా నచ్చకపోతే హిట్-3 సినిమా చూడొద్దని చెప్పాను. ఇప్పుడు హిట్-3 సినిమా నచ్చకపోతే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'SSMB 29' సినిమాను చూడవద్దు. ఈ సినిమాను తాకట్టు పెట్టిన ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఈ సినిమాను ప్రపంచమంతా తప్పకుండా చూసి తీరాల్సిందేనని హీరో నాని సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం నాని మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుస్తున్నాయి. ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: