తెలుగు సినీ పరిశ్రమలో గత కొద్ది రోజుల నుంచి సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షో పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. చాలామంది ఇప్పటికే అటు జడ్జిలకు సపోర్ట్ చేయగా మరికొంతమంది మాత్రం సింగర్ ప్రవస్తి కి సపోర్టుగా మాట్లాడుతున్నారు. కీరవాణి, సునీత పైన పలు రకాల ఆరోపణలు చేయడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు.తాజాగా ఇప్పుడు సింగర్ గీతామాధురి కూడా ఒక వీడియోని విడుదల చేస్తూ సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బాధపడ్డారని ఆమె చాలా మెంటల్ ప్రెజర్ లో ఉన్నదని ఇప్పటికే ఎన్నో కాంపిటీషన్ లో కూడా పాల్గొనింది అంటూ తెలిపింది.


ప్రవస్తి ఎక్కువ ఒత్తిడి వల్లే ఆమె అలా మాట్లాడి ఉండవచ్చని గీతామాధురి తెలిపింది.ప్రవస్తి ఒక షోలో గెలవనంత మాత్రాన నీ పని అయిపోయినట్టు కాదు.. వాటిని గుర్తు పెట్టుకో ప్రతి దాన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు అంటూ తెలిపింది. ఇండస్ట్రీలో గెలుపు ఓటములు సర్వసాధారణం అంతమాత్రాన నీకు పాడటం రాదని కూడా కాదు నీకు మేమంతా కూడా అండగానే ఉంటామంటూ తెలిపింది. నీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మద్దతుగా మేము సిద్ధంగానే ఉంటామని తెలిపింది సింగర్ గీతామాధురి.


నాకు తెలిసి కీరవాణి గారు సునీత, చంద్రబోస్ గారు అయితే ఒకరి చెడు కోరుకునే వ్యక్తిత్వం కలిగిన మనుషులు కాదు అంటూ వాళ్లు కష్టపడే పైకి వచ్చారని ఆశలు నువ్వు పాడిన పాట నచ్చలేదని కాదు.. వారు ఇండస్ట్రీలో చాలామందిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి వారిని చాలా దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాను కాబట్టే ఇలాంటివి పట్టించుకోని నీ జీవితాన్ని పాడు చేసుకోకు నీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యి మేమంతా ఎప్పటికీ నీకు అండగా ఉంటామంటూ గీతామాధురి తెలియజేసింది. మొత్తానికి గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రవస్తి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: