టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగార్జున , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఇలా నాగార్జున ప్రస్తుతం అనేక క్రేజీ మూవీలలో ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్న కూడా సోలో హీరో గా మాత్రం ఏ మూవీ కి కమిట్ కాలేదు. దానితో నాగార్జున అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాగార్జున తాజాగా ఓ టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల స్పెషలిస్ట్ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్లలో శైలేష్ కొలను ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు.

తాజాగా ఈయన నాగార్జునకు ఓ కథను వినిపించగా దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి నాగార్జునతో ఒక వేళ సినిమా చేస్తే ఏ జోనర్ సినిమా చేస్తాడో అని నాగార్జున అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శైలేష్ కొలను "హిట్ ది థర్డ్ కేస్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: