నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ రోజు అనగా మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తమిళ నటుడు అయినటువంటి సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని కూడా ఈ రోజు విడుదల చేయనున్నారు. నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ఇతర ప్రాంతాల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక రెట్రో మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉండగా ఇతర ప్రాంతాల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు మూవీ లు కూడా మంచి అంచనాల నడుమ విడుదల అవుతున్న ఒక విషయంలో మాత్రం రెట్రో మూవీ ని భారీ మార్జిన్ తో హిట్ ది థర్డ్ కేస్ మూవీ క్రాస్ చేసింది.

అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రేట్రో మూవీ ని భారీ మార్జిన్ తో హిట్ ది థర్డ్ కేస్ మూవీ క్రాస్ చేసింది. రేట్రో మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 14.5 కోట్ల కలెక్షన్లు దక్కగా హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి ఏకంగా 17 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అలా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రెట్రో మూవీ ని భారీ తేడాతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: