సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం విజయాలు ఉంటేనే అవకాశాలు వస్తాయి అని అనేక మంది అనేక సందర్భాలలో చెబుతూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇది రాంగ్ అని కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంత మంది కి నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీల ద్వారా మంచి విజయాలు దక్కకపోయినా క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ మంచి స్థాయిలో కెరియర్ను ముందుకు సాగించేవారు ఉన్నారు.

అలాంటి వారిలో కేతికా శర్మ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఇందులో ఈమె తన అందాలను భారీగా ఆరబోయడంతో ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కూడా ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోలేదు. అయినా కూడా ఈమెకు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉంది. దానితో ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఎందుకు ప్రధాన కారణం ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమె ఏ సినిమాలో అయినా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడుతుంది.

దానితో ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దానితో ఈమెను చాలా సినిమాల్లో హీరోయిన్గా ఎంచుకుంటున్నారు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే తాజాగా కేతిక శర్మ , శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సింగిల్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీని మే 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే కేతిక శర్మ క్రేజ్ తెలుగులో అద్భుతమైన రీతిలో పెరిగే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks