సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రజనీ కాంత్ కి భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా ... తమన్నా , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా జైలర్ 2 అనే మూవీ ని రూపొందించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే కొంత కాలంగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో జైలర్ 2 మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచేందుకు మూవీ యూనిట్ ప్రత్యేక ప్లానింగ్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన మాస్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఇకపోతే బాలకృష్ణ "జైలర్ 2" మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జైలర్ 2 మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాల్లో బాలకృష్ణ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించినట్లయితే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ లో నిజంగానే బాలకృష్ణ క్యామియో పాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: