చాలా రోజుల నుండి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకుంటున్న  సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా పుష్ప టు విడుదలయ్యాక విడుదలకు ముందు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఎంతో వివాదం చుట్టుముట్టింది. కానీ అల్లు అర్జున్ అరెస్టు అయ్యాక చిరంజీవి, నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత జైలు నుండి బెయిల్ మీద బయటికి వచ్చాక అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు. దాంతో వీరి మధ్య వివాదం ముగిసిపోయింది అనుకున్నారు. కానీ వీరి మధ్య రాజుకున్న వివాదం ముగియడం లేదుఅయితే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వివాదాలు తలెత్తుతున్న వేళ తాజాగా అల్లు అర్జున్ చిరంజీవి మీద చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇంతకీ అల్లు అర్జున్ చిరంజీవి గురించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. భారత ప్రధానమంత్రి మోడీ వేవ్స్ అనే సదస్సుని స్టార్ట్ చేశారు.

అయితే ఈ వేవ్స్ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలతో పాటు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేవ్స్ కార్యక్రమానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో కొంతమంది మీడియా మిత్రులు అల్లు అర్జున్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు.ఆ ప్రశ్నల గురించి సమాధానం చెబుతూ మా నాన్న 70 సినిమాలు నిర్మించారు. మా తాత వెయ్యి సినిమాల్లో నటించారు. మా మామ మెగాస్టార్ చిరంజీవి దక్షిణ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఫ్యామిలీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చిరంజీవి గారు అని పిలవకుండా మా మామయ్య గారు నాకు ఇన్స్పిరేషన్ అని, చిన్నప్పటినుండి ఆయన ప్రభావం నా మీద ఎంతో ఉంది అంటూ చెప్పుకోచ్చారు. అయితే చిరంజీవి గురించి పొగుడుతూనే నా ఫ్యాన్స్ కారణంగానే నేను ఇక్కడి వరకు వచ్చాను.ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను అని కూడా మాట్లాడారు.

అలా ఓవైపు మామయ్య చిరంజీవిని తలుచుకుంటూనే మరోవైపు అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని మాట్లాడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే చాలా రోజుల నుండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అని గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటున్న వేళ అల్లు అర్జున్ చిరంజీవిని తలచుకొని మెగా ఫ్యాన్స్ లో సంతోషం నింపారు.కానీ ఆ వెంటనే అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి మళ్లీ మంట పుట్టించారు అంటున్నారు కొంతమంది నెటిజన్లు.కానీ చాలామంది మాత్రం కేవలం చిరంజీవి ఉంటే అల్లు అర్జున్ ఈ స్తాయికి రాడు కదా. అభిమానులు ఆదరిస్తేనే అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చాడు అనేది కూడా అర్థం చేసుకోవాలి.చిరంజీవి సపోర్ట్ తో పాటు అభిమానుల సపోర్ట్ కూడా అల్లు అర్జున్ కి ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: