ఈ మధ్యకాలంలో తెలుగు హీరోస్ హిట్ కొట్టిన దాఖలాల లేవు.  తాజాగా నాని హిట్ త్రీ సినిమాతో తన ఖాతాలో మంచి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకున్నాడు . అయితే పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్స్ మాత్రం కోట్ల బడ్జెట్ పెడుతున్న అసలు హిట్ అన్న పదానికి దూరమైపోతున్నారు . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ లాంటి రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం జనాలకు సైతం మింగుడు కూడా పడడంలేదు.  అసలు ఆ కధా..?కంటెంట్ ఏంటి బాసు అంటూ రాంచరణ్ పై సైతం అసహనం వ్యక్తం చేశారు.


కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు అంతకుముందు తారక్ నటించిన దేవర సినిమా ని కూడా అలాగే ట్రోల్ చేశారు జనాలు . దేవర సినిమా అసలు ఏముందని..? అంటూ కూడా ఫైర్ అయ్యారు. కాగా పాన్ ఇండియా స్టార్స్ అంటూ చెప్పుకుంటున్న ప్రభాస్ - తారక్  -రామ్ చరణ్ సినిమాలు ఈ మధ్యకాలంలో అసలు హిట్ అయిన దాఖలాలే లేవు. కాగా చిన్న చిన్న కాన్సెప్ట్ తో చిన్నచిన్న బడ్జెట్ తో వస్తున్న మూవీలు మాత్రం బాగా హిట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది .



పెద్ద హీరోలకి హిట్ కొరత ఏర్పడింది అని ..అలా అని చిన్న డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అవ్వలేక పోతున్నారు పాన్ ఇండియా  స్టార్స్. వన్స్ పాన్ ఇండియా ఇమేజ్ రేంజ్ సంపాదించుకున్నాక చిన్న సినిమాలను ఓకే చేస్తే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది అనే భ్రమలో ఉంటారు . పెద్ద సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఎవరూ ఆదరించడం లేదు. స్టార్ హీరోలు కాస్త జీరోలు అయ్యే పరిస్ధితి వచ్చింది.  చిన్న హీరోలు మాత్రం మంచి మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాలను చిన్న బడ్జెట్ లోనే ఓకే చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు . పాన్ ఇండియా స్టార్ హీరోస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి...??

మరింత సమాచారం తెలుసుకోండి: