ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అందరి నోట ఎక్కువగా వినిపిస్తున్నది హిట్ 3 హిట్ 3 హిట్ 3..  నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయే ఫిలిం ఇది. ఆ రేంజ్ లోనే ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఉంది అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు . నాని అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది సాఫ్ట్ కోణం.  సైలెంట్ గా తన పని తాను చేసుకునిపోతూ ఉంటాడు. ఎక్కడ కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కోడు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన నాని తనదైన స్టైల్ నటించి మెప్పిస్తూ ఉంటాడు. అంతే ఇంతవరకే మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.


అయితే నానిలో ఇంత వైల్డ్ యాంగిల్ దాగి ఉంది అన్న విషయం హిట్ 3 ద్వారానే బయటపడింది . హిట్ 3 సినిమా గురించి ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . కాగా ఈ సినిమా అయిపోయింది అనుకోని థియేటర్స్ నుంచి బయటికి వచ్చేలోపే హిట్ ఫోర్ సినిమాను అనౌన్స్ చేసింది మూవీ టీం. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ని సెలెక్ట్ చేసుకున్నారు చిత్ర బృందం . ఏసీబీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఇంట్రడ్యూస్ ఇచ్చిన విధానం హైలెట్గా మారింది . ఇంకా పక్క చెప్పాలి అంటే 2 1/2 గంట సేపు తెరపై నానిని చూసిన జనాలకి నవ్వే రాలేదు .



కానీ ఏసిపి వీరప్పన్ అంటూ కార్తీనీ ఇంట్రడ్యూస్ చేయగానే థియేటర్లో అరుపులు కేకులతో హోరెత్తిపోయింది . కచ్చితంగా హిట్ త్రీపై కన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేలా కార్తీ యాక్ట్ చేశాడు అనడంలో సందేహమే లేదు. నిజానికి ఏసిపి వీరప్పన్ పాత్రలో ముందుగా తెలుగు హీరో మాస్ మహారాజ రవితేజని అనుకున్నారట.  ఆయనని అప్రోచ్ కూడా అయ్యారట . కానీ ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట . రవితేజ కి ఈ పాత్ర అంతగా సూట్ కాకపోవచ్చు అంటూ ఆయన స్వయంగా ఈపాత్రని రిజెక్ట్ చేశారట .



కొన్ని కొన్ని పాత్రలు మన వద్దకు వచ్చిన మనకి సూట్ కానప్పుడు మనం యాక్సెప్ట్ చేయకూడదు . అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి రాసిపెట్టి ఉంటుంది అని అభిప్రాయం ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు రవితేజ.  ఆ కారణంగా రవితేజ ఈ రోల్ ని మిస్ చేసుకున్నాడు ఏమో అంటున్నారు జనాలు . ఏ మాటక ఆ మాట కార్తీ నటిస్తే జనాలు ఆగుతారా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయరు.. ఎప్పుడెప్పుడు వస్తుందో ఈ మూవీ అంటూ ఫ్యాన్స్ వేఇ కళ్ళతో వెయిటింగ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: