నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో ముందుకు దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ ని నిన్న అనగా మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఓపెనింగ్లు లభించాయి. ఇకపోతే మొదటి నుండి ఈ సినిమాకు నార్త్ అమెరికాలో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో వచ్చిన కలెక్షన్లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నార్త్ అమెరికాలో పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: