
పోలీసులు ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఈ కేసును కొట్టివేయడం గమనార్హం. జస్టిస్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో ఐదుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా జరిగిన విచారణలో జేవీ ఫణిదత్ వాదనలు వినిపించడం జరిగింది.
ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్ గా పని చేస్తున్నారని ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారని క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని చెప్పుకొచ్చారు. షెడ్యూల్ కులాల ఆర్డర్ ప్రకారం హిందూ మతం కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీం కోర్టు తీర్పులు ఇవ్వడం కొసమెరుపు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు