టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే బన్నీ కొన్ని సంవత్సరాల క్రితం పరుగు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. షీలామూవీ లో అల్లు అర్జున్ కి జోడిగా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని 2008 వ సంవత్సరం మే 1 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీ విడుదల అయ్యి నిన్నటితో 17 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ కి ఆ సమయంలో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 6.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.70 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.30 కోట్లు , ఈస్ట్ లో 79 లక్షలు , వెస్ట్ లో 72 లక్షలు , గుంటూరులో 1.70 కోట్లు , కృష్ణలో 1.32 కోట్లు , నెల్లూరులో 76 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 17.42 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 2.61 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 20.03 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 18.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 20.03 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ 1.7 కోట్ల లాభాలను అందుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa