టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నాగ వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుస సినిమాలను నిర్మిస్తూ అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. నాగ వంశీ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను అందుకుంటున్నాడు. దానితో ఇప్పటికే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ నిర్మాతలు కూడా ఆయన సినిమాల ఫలితాలను చూసి కంగు తింటున్నారు. ఇకపోతే తాజాగా నాగ వంశీ "మ్యాడ్ స్క్వేర్" అనే మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. మరి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.93 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.90 కోట్లు , ఈస్ట్ లో 2.30 కోట్లు , వెస్ట్ లో 1.25 కోట్లు , గుంటూరు లో 2.15 కోట్లు , కృష్ణ లో 1.80 కోట్లు , నెల్లూరు లో 1.08 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30.11 కోట్ల షేర్ ... 51.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 6.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 38.61 కోట్ల షేర్ ... 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 22 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 16.61 కోట్ల లాభాలను కూడా అందుకని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: